కదలి రమ్ము నవభారత నారీమణి కదలి రమ్ము!
అభ్యుదయం నీ సొంతం... మార్పు, తీర్పు, నీ సొంతం
నీరు, నిప్పు, గాలి, నింగి అసాంతం నీ సొంతం
ఉద్యమాల పెనుమంటల ప్రజ్వలింపు నీ సొంతం
లాలిత్యం నీ సొంతం... చైతన్యం నీ సొంతం...
సామాజిక కుట్రలోన నీ బ్రతుకే తారుమారు
సతి మంటల కోరల్లో బంధించిరి గతమంతా
మతాలన్ని ఒక్కటై వెలివేసెను బ్రతుకంతా
శిశువుగానె నీ బ్రతుకు గర్భంలో ఆరిపోయె
ఎదపైని జిలుగు పైట ఉరితాడై బలి చేసె
పుట్టుకతో శాపవతివి... ఈడొస్తే కుంపటివి...
సుఖం కోరి నరాలన్ని జివ్వుమంటె వెలయాలివి
మనువాడిని నీ మగనికి ఆలిన్ వన్ ఇల్లాలివి
ఏలమ్మా నీకీ గతి? ఏదమ్మా నీ ప్రగతి?
తెలంగాణ పోరులోన అమరుడైన నీ మగనికి
వారసురాల్నేనంటూ గుడ్లురిమి హుంకరించి
బందూకును చేతబట్టి శత్రువు నెదురొడ్డినట్టి
సమరశీల చరితా! ఓ వనితా!! వీరాంగన!!!
గోదావరి లోయలోన స్వర ఝరివై శృతి కలుపుతు
శ్రీకాకుళ సవరన్నల దన్ను నిల్చి పోరు సల్పి
నగ్జల్బరి గర్జనలో గొంతు కలిపి నినదించావ్!
నాటి వాడి, వేడి, పదును ఏమాయెను? ఎటు పోయెను?
అంబరాన్ని చుంబిస్తూ... విశ్వాన్నే వణికిస్తూ...
సమర శంఖ నాదమై మార్మోగిన నీ గానం
ఆడతనం గొంతులోన అపశృతుల పాలాయె
చక్రస్తని, చంద్రహాస, చంచరీక వర్ణనలో
ప్రబంధాల కధనంలో మూర్ఛిల్లిన ఆడతనం
తార, కోమలాంగి వంచు, తేజ స్నిగ్ధ దేహవంచు
భావ కవిత పునాదిలో సమాధైన ఆడతనం
ప్రేమ కధా కావ్యాల్లో చెరచబడ్డ ఆడతనం
ఆడతనం... ఆడతనం... నిన్నణిచిన ఆడతనం...
ఆడతనం చీకటిలో బ్రతుకంతా బందీవై
ఆడతనం మత్తులోన శక్తులన్ని సత్తువుడిగి
తరతరాల నికృష్టపు అబల బ్రతుకు ఇంకెంతని
అగ్ని మండి గుండెలోన ఆరదేమని కళవళపడి
కంట నీరు కురిపించకు! చండ్ర నిప్పులు చెరిగించు!
కొండల్నీ, లోయల్నీ, పుడమినంత ధిక్కరించి
నీ అడుగే బాసటగా ఊరూరా ఉప్పెనలా
అఖిల లోక మహిళ జగతి గొంతెత్తి ఘూర్ణిల్లగ
భీరత్వాన్నణిచి పెట్టి వీరత్వం జూలు దులిపి
పీడిత జన మనుగడకై... స్త్రీ విముక్తి సాధనకై
విప్లవాల బాటలోన... మునుముందుకె సాగిపో!!!

(ప్రచురణ: ప్రగతి 13/04/1989)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అవాంఛిత వ్యాఖ్యలను తొలగించబడతాయని విన్నవించుకుంటున్నాను.